![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -996 లో...మహేంద్ర, అనుపమ ఇంటికి వస్తారు. డల్ గా ఉన్న వసుధారని చూసి.. పాపం వసు అదే బాధలో ఉంది. భోజనం కూడా చెయ్యనట్టు ఉంది. నువ్వు వెళ్లి నచ్చజెప్పు భోజనానికి తీసుకొని రా అని మహేంద్రకి అనుపమ చెప్తుంది.. ఆ తర్వాత మహేంద్ర ఆలోచించి వసు దగ్గరకి వెళ్తాడు. అక్కడే ఉన్న పూల దండ కింద పడి ఉండడం చూసి ఎవరు వచ్చారు.. మళ్ళీ ఆ శైలేంద్ర వచ్చాడా అని మహేంద్ర అడుగుతాడు.
ఆ తర్వాత చక్రపాణి వచ్చి.. ఆ రాక్షసుడు మళ్ళీ వచ్చాడని చెప్తాడు. రాక్షసుడు ఎవరని అనుపమ అడుగుతుంది. ఇక రాజీవ్ వచ్చిన విషయం గురించి చక్రపాణి చెప్తాడు. రాజీవ్ ఎవరని అనుపమ అడుగుతుంది. దాంతో చక్రపాణి రాజీవ్ గురించి మొత్తం చెప్తాడు. తను చేసిన కుట్రలు గురించి చెప్తాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనుపమ అడుగుతుంది. అయినా ఇప్పుడు వాడు ఎందుకు వచ్చాడు? ఏం అన్నాడని మహేంద్ర అడుగుతాడు. రాజీవ్ అన్న మాటలు మహేంద్రకు చెప్తాడు చక్రపాణి. కాసేపటికి నువ్వు ఇప్పుడు దైర్యంగా ఉండాలని వసుధారకి అనుపమ దైర్యం చెప్తుంది. భోజనానికి రమ్మని మహేంద్ర, అనుపమలు చెప్తారు. ఆ తర్వాత రాజీవ్, శైలేంద్రలు కలిసి మాట్లాడుకుంటారు. నువ్వు ఎందుకు వసుధార దగ్గరికి వెళ్ళావ్? ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని శైలేంద్ర అంటాడు. నాకు చూడాలి అనిపించి వెళ్ళాను కానీ మా మామ, నా మరదలు వాయించి వదిలేసారని రాజీవ్ చెప్తాడు.
ఆ తర్వాత ఎండీ సీట్ నీది ఆ సీట్ లో మరదలు పిల్ల నాది.. అందుకోసం ఏమైనా చేసుకో కానీ నా మరదలుపై ఎటాక్ లు ప్లాన్ చెయ్యకు. వసుధారకి రిషి అంటే ఎంత ఇష్టమో నాకు వసుధార అంటే అంత ఇష్టం. నువ్వు ఏదైనా ప్లాన్ చేస్తే నిన్ను లేపేయ్యడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించనని శైలేంద్రకి రాజీవ్ చెప్తాడు. మరుసటి రోజు కాలేజీ లో ఉన్న వసుధార దగ్గరకి ఇద్దరు వ్యక్తులు వస్తారు. రిషి సర్ ఒకసారి మా దగ్గరకి వచ్చి.. మా కాలేజీ ప్రాబ్లమ్ లో ఉంది. నలభై కోట్లు కావాలని తీసుకున్నాడు. మేం ఇచ్చాము.. మాకు ఇప్పుడు కావాలి.. ఇదిగో ప్రూఫ్ అని చూపిస్తారు. అది ఫేక్ అని వసుధార అంటుంది. అయిన వాళ్ళ వినకపోయేసరికి మహేంద్రకి కాల్ చేసి చెప్తుంది. ఆ తర్వాత బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు అది నిజం అంటారు కానీ మహేంద్ర ఫేక్ అంటాడు. పేపర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయని అనుపమ చూసి చెప్తుంది. కోర్ట్ కి వెళతామని వాళ్ళంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని మహేంద్ర అంటాడు. కోర్ట్ కి వెళ్తే వాళ్ళే గెలుస్తారని అనుపమ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |